టెక్కలి: కోటబొమ్మాళిలో వంశధార విద్యా సంస్థలకు ఆనుకుని ఉన్న సుమారు 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రతి రోజూ కొంత మంది ఆకతాయిలు ఇదే తోటల్లో మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతుంటారని ఈ క్రమంలో సిగరెట్లు తాగి పడేసి ఉండడంతో ఎండిపోయిన ఆకులకు మంటలు వ్యాపించి ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన కొంత మంది పాఠశాలలో ఉన్న మోటారు సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పాఠశాల యజమాని చింతాడ అనిరుద్రడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ ప్రమాదంలో అనిరుద్రుడు, టి.కృష్ణారావు, బోయిన సాయి, మణిపాత్రుని భాను, బాబులు, రవి, భగవాన్‌లకు చెందిన 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు దగ్ధమై లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది.


