డీబీసీ టు ఏబీసీ | - | Sakshi
Sakshi News home page

డీబీసీ టు ఏబీసీ

Mar 29 2026 6:48 AM | Updated on Mar 29 2026 6:48 AM

డీబీసీ టు ఏబీసీ ● కర్నూలులో జరిగిన అక్రమాలపై చర్యలు ● జిల్లాలో అక్రమాలపై ఉన్నతాధికారుల విచారణ జిల్లాలోనూ అవకతవకలే..

● కర్నూలులో జరిగిన అక్రమాలపై చర్యలు ● జిల్లాలో అక్రమాలపై ఉన్నతాధికారుల విచారణ

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధకు డిమోషన్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

లంచాలు తీసుకోవడం, కిందిస్థాయి సిబ్బందిని ఇంటి పనికి పెట్టుకోవడం, ప్రతి పనికీ డబ్బు లు అడగడం, అక్రమాలపై రాజకీయ అండతో కప్పిపుచ్చుకోవడం.. ఏళ్లకు ఏళ్ల పాటు సాగిన ఈ తంతుకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ అక్రమాలపై ఎట్టకేలకు ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యింది. ఆమె హోదా తగ్గించడమే కాకుండా పీలేరుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి(డీసీబీ) అనురాధపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనురాధపై ఇదివరకే లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగులను అవమానపరిచినట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరగకుండా జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఒత్తిడి తెచ్చుకొని తప్పించుకున్న ఆమె.. ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయారు. తాజాగా విజయవాడ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ.మల్లికార్జునరావు ఈమెకు డిమోషన్‌ ఇచ్చారు. అంతేకాకుండా బదిలీ చేస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం డీబీసీడబ్ల్యూఓగా ఉన్న ఈమెను ఏబీసీడబ్ల్యూఓ(సహాయ బీసీ సంక్షేమాధికారి)గా హోదాను తగ్గించారు. నాలుగేళ్ల పాటు డీబీసీడబ్ల్యూఓగా పనిచేసిన ఈమెను తిరిగి ఏబీసీడబ్ల్యూఓగా నియమించడం పరాభవంగానే చెప్పాలి. ఆమెను ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పీలేరు ఏబీసీడబ్ల్యూఓగా బదిలీ చేశారు.

అనురాధ కర్నూలు జిల్లాలో ఏబీసీగా పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలు, పర్యవేక్షణ లోపం, లంచాలు ఇతర అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని విచారించాక డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ విచారణ చేసి ఆమెను డీబీసీడబ్ల్యూఓ నుంచి ఏబీసీడబ్ల్యూఓగా వెనక్కి పంపించాలని నిర్ణయించారు. కర్నూలు నుంచి ఆమె తాత్కాలిక పదోన్నతి పద్ధతిలో నాలుగేళ్ల కిందట శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూఓగా బదిలీపై వచ్చారు. ఇచ్ఛాపురానికి చెందిన శాసన సభ్యుడి అండదండలు అందడంతో ఈమె అక్రమాలు పెచ్చుమీరాయి. విజయవాడలో జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఆర్థిక లావాదేవీలు జరిపేవారన్న అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తొక్కి పెట్టి ఉంచడంతో ఇంతవరకు ఆమె ఆటలు సాగాయి. ఎట్టకేలకు కర్నూలు అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో చర్యలకు ఉపక్రమించారు.

ఆమె జిల్లాకు డీబీసీడబ్ల్యూఓగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. జిల్లాలోనూ ఆమైపె అనేక ఆరోపణ లు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది సైతం ఆమైపె పలు రకాల ఫిర్యాదులు చేశారు. రాజకీ య నాయకుల అండతో వాటిని తొక్కిపెట్టి నెట్టుకొచ్చారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాల్లోనూ, కింది స్థాయి సిబ్బంది పదోన్నతులలోనూ రూ.లక్షల్లో చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే ప్రతి వసతి గృహం నుంచి ప్రతి నెల పిల్లల సంఖ్యను బట్టి నెల వారీ వసూలు చేస్తున్నట్టు, ఇటీవల జరిగి ఏసీబీ దాడుల్లో బయట పడింది. దీనిపై ఇంచా విచారణ సాగుతోంది. ఈ విచారణ పూర్తయితే మరోసారి ఈమైపె శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాకు వచ్చిన తర్వాత బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చి న నిధులు రూ.లక్షల్లో కాజేశారని అప్పట్లో బీసీ సంఘాల వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లలో శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్లు, బదిలీలు, డిప్యూటేషన్ల పేరుతో అవినీతి, అక్రమంగా శాంతి నగర్‌లో రూ. కోటి విలువైన ఆస్తులు సంపాదించినట్టు ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే బీసీ సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బందిని తన ఇంటి వద్ద పనులకు వినియోగించుకుంటారనే అపవాదు కూడా ఉంది. జిల్లాలో జరిగిని అవినీతిపై విచారణ పూర్తయితే ఈమైపె మరిన్ని చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement