ఆమదాలవలస: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్కులపేట, దూసి, తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పీహెచ్‌సీలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెడికల్‌కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేసి డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. తొగరాం స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు.


