వైఎస్సార్‌సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు | Police Impose Restrictions On YSRCP Chalo Mulapeta Port Program, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు

Mar 29 2026 1:35 PM | Updated on Mar 29 2026 5:20 PM

Police Obstacles For Ysrcp Visit To Mulapeta Port

సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

మూలపేట పోర్టుకు వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్‌ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్‌ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు.  షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్‌ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement