● సీతారామం
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీకాకుళం నగరంలోని కోదండరామాలయంలో కల్యాణశోభ
వరుడు.. రఘుకుల తిలకుడు.. వధువు.. భూమాత కూతురు. వేద మంత్రాల మధ్య వేదికలు అయోధ్యలా మారాయి. పెళ్లి సందడితో ఆలయాలు వివాహ మండపాలుగా కనిపించాయి. జానకి రాముల పరిణయ ఘట్టాన్ని తిలకించే భాగ్యం పొందిన భక్తులు తన్మయత్వంలో మునిగారు. శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా రామాలయాల్లో సీతారాముల పెళ్లి జరుపుకున్నారు. వడపప్పు, పానకం పంచి పెట్టి సంబరం చేశారు.


