మత్స్యకారుల సమస్యలపై సైకిల్‌యాత్ర | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సమస్యలపై సైకిల్‌యాత్ర

Mar 28 2026 7:12 AM | Updated on Mar 28 2026 7:12 AM

మందస : మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 700 కిలోమీటర్లు మేర సైకిల్‌యాత్ర చేపడుతున్నట్లు కవిటి మండలం కపాసుకుద్ధి గ్రామానికి చెందిన గుడార ప్రసాద్‌ తెలిపారు. డొంకూరులో ఈ నెల 13న ప్రారంభమైన యాత్ర శుక్రవారం గెడ్డవూరు గ్రామ తీరానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 55 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు ప్రసాద్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement