ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఆమదాలవలసలోని తమ్మినేని స్వగృహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. పరామర్శించిన వారిలో పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఆరంగి మురళి, పార్టీ నాయకుడు పొందర అప్పన్న, తదితరులు ఉన్నారు.


