కల్యాణం వీక్షిస్తున్న భక్తులు
శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. అంతకుముందు రామాలయాలు, రామమందిరాల వద్ద వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధనలు, కోలాట భజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. – శ్రీకాకుళం కల్చరల్/వజ్రపుకొత్తూరు రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం


