● జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు ● 30న పోర్టుకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
టెక్కలి, సంతబొమ్మాళి:
దశాబ్దాల పాలనలో టీడీపీ జిల్లాకు చేయలేని పనులు వైఎస్ జగన్ ఐదేళ్లలో చేసి చూపించారని, జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శనివారం నౌపడ మూడు రోడ్లు జంక్షన్‌లో గల బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.4361కోట్లతో మూలపేట పోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి అధికారంలోకి వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. పనులు చేయకపోగా.. పోర్టు చంద్రబాబు కృషి ఫలితంగా వచ్చిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంపై నిజానిజాలు ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 30న పోర్టుకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జిల్లాను పాలించిన టీడీపీ ఈ జిల్లా ప్రజలకు ఏం చేశారో ప్రశ్నించాలన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారు జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాల తో అభివృద్ధిలో పోటీ పడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దీనిపై టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం సిగ్గు చేటన్నారు. పోర్టుకు పోదాం బలప్రదర్శన కాదని, వాస్తవ పరి స్థితులు ప్రజలకు వివరించడానికి అని తెలిపారు.
వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా తిలక్ మాట్లాడుతూ... గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. శాంతియుతంగా పరిశీలన కార్యక్రమం చేపడుతున్నామని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోర్టు పేరుతో సుమారు 36 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని, దీన్ని ఉద్యమంగా మార్చొద్దని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం, ఆమదాలవలన నియోజకవర్గ ఇన్‌చార్జిలు సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, చింతాడ రవికుమార్, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు చల్లా రవికుమార్, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధనుంజయ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయిసురేష్‌కుమార్, సీనియర్ నాయకులు అంబటి శ్రీను, సనపల నారాయణరావు, పిన్నింటి సాయికుమార్, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పాలిన శ్రీనివాస్, ఆరంగి మురళి, నర్తు నరేంద్ర, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, దుబ్బ వెంకట్రావు, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు బి.మోహన్‌రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్రావు, ఎస్.హేమసుందర్‌రాజు, టి.ఫల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కంచిలి ఎంపీపీ పి.దేవదాస్‌రెడ్డి, ఎస్.సత్యం, జి. గురునాద్ యాదవ్, పి.రాజా, పి.రవికుమార్‌రెడ్డి, కె.సతీష్, కె.అజయ్, ఉంగ సాయి, శిష్టు గోపి, టి.కిరణ్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు.


