న్యూస్‌రీల్
శ్రీకాకుళం
ఎందుకో.. ఏమోసూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విముఖత కనిపిస్తోంది. అంతగా ఆదరణ దక్కడం లేదు. –8లో
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సైబర్ కేసులను ఛేదిస్తున్నాం..
ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు, బాగా చదువుకున్నవాళ్లే అధికంగా మోసపోవడం వాస్తవం. గత ఏడాది నుంచే డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రాడ్స్ వంటి కేసుల్లో పురోగతి సాధిస్తున్నాం. చదువుకున్న వారే సరిగా చెక్ చేసుకోక మోసపోతున్నారు.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
తక్షణం ఫిర్యాదు చేయాలి
డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ వంటి సైబర్ నేరాల్లో తక్షణమే ఫిర్యాదు చేస్తే ఖాతాలను ఫ్రీజ్ చేసే వీలుంటుంది. ఏ అకౌంట్లలోకి డబ్బు వెళ్లిందో.. ఆ అకౌంట్లు ఎవరివో తెలుసుకుని కోర్టులో మెమో వేస్తాం. కోర్టు ఆర్డర్‌ను బట్టి సంబంధిత ఖాతాల నుంచి అమౌంట్ రికవరీ చేసి నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం. ఇటీవల ఓకేసుకు సంబంధించి విజయవాడలో ముగ్గురిని పట్టుకున్నాం. మరికొందరు అనుమానితులకై వెస్ట్‌బెంగాల్, రాజస్థాన్ వరకు వెళ్లాం.
– ఈశ్వరరావు,
సీఐ, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్, శ్రీకాకుళం
శ్రీకాకుళం క్రైమ్ : లాయర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులే.. వారి టార్గెట్. బ్యాంకులో అంతో ఇంతో సొమ్ము దాచుకునే వారే వారి లక్ష్యం. వారు చదువుకున్న వారని, అన్నీ వారికి తెలిసే ఉంటాయన్న భయమే లేదు. డిజిటల్ అరెస్టు పేరుతో నాటకాలు ఆడి ఖాతాల్లో సొమ్ము కాజేస్తున్నారు.
వేధింపులు, ఆరోపణలతో..
ఈ నేరాల ప్రక్రియే వింతగా ఉంటుంది. ముందుగా పోలీస్ సెటప్‌తో ఉన్న వ్యక్తులు వీడియో కాల్ చేస్తారు. ముంబై క్రైమ్ బ్రాంచి, ఢిల్లీ సీబీఐ, సీఐడీ, కస్టమ్స్ ఆఫీసర్లమంటూ నమ్మబలుకుతారు. విదేశాల్లో ఉన్న మీ కొడుక్కి అక్కడి గ్యాంగ్‌స్టర్లతో లింకులు ఉన్నాయంటూ, మీకు వచ్చిన కొరియ ర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారంటూ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. విద్యార్థినుల అశ్లీల వీడియోలు చిత్రించి వెబ్‌సైట్లలో పెడుతున్నారంటూ.. దొంగ ఆరోపణలు చేసి ముందుగా బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తామని హెచ్చరిస్తారు. తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తే తప్పించుకునే వీలుందని, ఎవరి వద్దనైనా విషయం చెప్పినా, మీడియాలో వచ్చినా మీ పరువే పోతుందని, కేసు కూడా రిజిస్టర్ అవ్వడం ఖాయమని చెప్పి డబ్బులు గుంజేస్తారు.
ఆ ఖాతాలన్నీ ఫేకే..
ఇలా మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా జార్ఖండ్, యూపీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు. వీరు పేద ప్రజలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లించి వారి పేరు మీద కరెంట్ ఖాతా తెరిచి వాడుతుంటారు. మోసం చేసేటప్పుడు వారి ఖాతాల్లోనే డబ్బులు పడేలా చేసి పడ్డాక విత్‌డ్రా చేసేస్తారు. ఫోన్ సిమ్‌లు కూడా ఇలా పేదల పేర్లతోనే తీసుకుంటారు. పని పూర్తయ్యాక ఆ ఖాతాలను క్లోజ్ చేసేసి సిమ్‌లను పడేస్తారు. సామాన్య ప్రజల ఖాతాల్లో తక్కువ డబ్బులుండటం, వారికి అన్ని భాషల పరిజ్ఞానం ఉండకపోవడంతో ఇలా కాస్త డబ్బున్న వారినే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు.
కొన్ని కేసులు..
● ఇటీవల జిల్లాకేంద్రంలో రిటైర్డ్ డీఎంహెచ్‌ఓను బెదిరించి రూ. 56 లక్షలకు పైగా కాజేశారు.
● రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిని సైతం డిజిటల్ అరెస్టు పేరు చెప్పి రూ. 13.5 లక్షలు కాజేశారు.
● జిల్లా కేంద్రానికి చెందిన చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 11 లక్షలు మోసపోయాడు. ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్‌నని చెప్పి పోలీస్ గెటప్‌లో వచ్చిన సైబర్
రెచ్చిపోతున్న సైబరాసురులు
అబద్ధపు ఆరోపణలతో డిజిటల్ అరెస్టుల నాటకం
బాధితుల్లో లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్, రిటైర్డ్ ఉన్నతోద్యోగులు
మోసగాళ్లు ఓటీపీలు అడిగి ఖాతాలోని సొమ్మును మాయం చేశారు.
ఓ ప్రముఖ వైద్యుడు డిజిటల్ అరెస్టు పేరిట రూ. 80 లక్షలకు పైగా మోసపోయాడు. తక్షణమే అప్రమత్తమై సైబర్‌సెల్‌కు, బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో కొంత మొత్తాన్ని రికవరీ చేయగలిగారు.
జిల్లాకేంద్రంలో ఓ మెకానికల్ ఇంజినీర్ నుంచి డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.03 కోట్లు కాజేశారు. కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.
ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ పేరిట తైవాన్ నుంచి ముంబై అడ్రస్‌కు మీకు డ్రగ్ పార్సిల్ వచ్చిందంటూ జిల్లాకేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరును బురిడీ కొట్టించి రూ. 20 లక్షలు కాజేశారు.
కాశీబుగ్గలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను రూ. 1.05 కోట్లు నష్టపోయాడు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఓ అడ్వకేట్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.32 కోట్లు మోసపోయినట్లు సమాచారం.


