పోర్టుకు పోదాం సభతోనే ప్రభుత్వంలో చలనం | - | Sakshi
Sakshi News home page

పోర్టుకు పోదాం సభతోనే ప్రభుత్వంలో చలనం

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌

● వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌

టెక్కలి: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చలనం కలిగిందని, దీంతో మంత్రులను పోర్టుకు పరుగులు పెట్టించారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ అన్నా రు. మంగళవారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూలపేట పోర్టు పనులపై మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్న అబద్ధాలు ఒక్క సారిగా బహిర్గతమయ్యాయని తిలక్‌ ఎద్దేవా చేశారు. పోర్టు పనులు 70 శాతం మాత్రమే జరిగాయని ఆర్‌ అండ్‌ బీ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి చెప్పడంతో పోర్టు పరిశీలించిన కూటమి నాయకులు అవాక్కయ్యారని తిలక్‌ పేర్కొన్నారు. పోర్టు పనులపై కనీసం అవగాహన లేకుండా కేవలం ఆర్డీవో అందజేస్తున్న స్క్రిప్ట్‌తో మంత్రి అచ్చెన్నాయుడు లేనిపోని అబద్ధాలు చెబుతూ వచ్చారని తిలక్‌ మండిపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల నాటికి పోర్టు పనులు చేపట్టిన విశ్వ సము ద్ర సంస్థకు ఎంత మేరకు బిల్లులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని తిలక్‌ డిమాండ్‌ చేశారు. కేవలం మంత్రి పదవి కాపాడుకోవడానికే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా అధికారం దక్కించుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఈ జిల్లాకు గానీ, టెక్కలి నియోజకవర్గానికి గానీ ఎలాంటి శాశ్వత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టు, నిర్వాసిత కాలనీ, రోడ్లు, రైల్వే మార్గాలు ఇతర అవసరాల కోసం గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రకాల అనుమతులతో పా టు ఆర్థిక వనరులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్ల కూటమి పాలనలో కనీసం నిర్వాసిత కాలనీ కూడా పూర్తి చేయలేని అసమర్థత మంత్రి అచ్చెన్నాయుడు అని తిలక్‌ మండిపడ్డారు. సమావేశంలో సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సత్తారు సత్యం, యువజన విభాగం అధ్యక్షుడు చిన్ని జోగారావు, ఆర్టీఐ వింగ్‌ అధ్యక్షుడు బి.రాజేష్‌ తో పాటు డి.ఈశ్వరరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement