కొత్తూరు: మండలంలోని కడుము గ్రామ పంచాయతీ పరిధిలోని కడుము, కడుము కాలనీ, గొట్లభద్ర, జగన్నాథపురం గ్రామాల్లో వీధి లైట్లు చాలాకాలంగా వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి ఇవి వెలుగుతూనే ఉండడం విశేషం. ట్రాన్స్ కో అధికారులకు పంచాయతీ సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు పలు దఫాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తుఫాన్ సమయంలో వీధి లైట్లకు సంబంధించిన వైర్లు పాడైపోయాయి. అప్పటి నుంచి వీధి లైట్లకు కేబుల్ వేయలేదు. ఇంటికి సంబంధించిన వైర్లతో కనెక్షన్ ఇచ్చారు. దీంతో వీటిని ఆఫ్ చేసే అవకాశం లేకుండాపోయింది. ట్రాన్స్ కో అధికారులు స్పందించి స్ట్రీట్ లైన్‌కు సంబంధించి కేబుల్ ఏర్పాటు చేయలని పలువురు కోరుతున్నారు


