శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘పద్నాలుగేళ్లుగా వారసత్వ భూమి కోసం పోరాడుతున్నాను. న్యాయం జరగలేదు. ఇప్పుడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాను. కానీ ఆదుకునే వారు లేరు. కనీసం పింఛనైనా ఇచ్చి కరుణించండి’ అంటూ శ్రీకాకుళం నగరానికి చెందిన లొట్టి మంగమ్మ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇదివరకు ఆమె ఇదే పీజీఆర్‌ఎస్‌లో అధికారుల సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆమెకు న్యాయం జరగలేదు. ఆమెకు న్యాయస్థానం అప్పజెప్పిన భూ మి రియల్ ఎస్టేట్‌లో పడిపోవడంతో న్యాయం కోసం తిరుగుతున్నారు. పింఛన్ కోసం కూడా రెండేళ్లుగా తిరుగుతున్నారు. ఎన్ని సార్లు తిరగాలని ఎస్‌డీసీ జయదేవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.


