నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించామో అది నెరవేరిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పోర్టు యాత్రను విజయవంతం చేసిన కార్యకర్తలు, నా యకులను అభినందించారు. అలాగే సభకు హాజరైన ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తల ఐక్యత చూసి కూటమి ప్రభుత్వం వణికిపోయిందని పేర్కొన్నారు. పేరాడ తిలక్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు, యువత అండగా నిలిచారని తెలి పారు. సమావేశంలో పార్టీ నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, సురంగి నర్శింగరావు చిన్ని జోగారావు, బొబ్బాది ఈశ్వరరావు, బుద్దల రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.


