ఒత్తిడితో.. | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో..

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

దళం ఇక గతమే..జిల్లాలో నక్సలిజం గతం కానుంది. స్థూపాలు మాత్రమే మిగిలాయి. –8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
దళం ఇక గతమే..జిల్లాలో నక్సలిజం గతం కానుంది. స్థూపాలు మాత్రమే మిగిలాయి. –8లో
ఏ పనీ చేయలేకపోతున్నాం

జాబ్‌ చార్టును మర్చిపోతున్నాం

వారమంతా సెలవు లేకుండా గడిచిపోతోంది

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ముందు గగ్గోలు పెట్టిన రెవెన్యూ ఉద్యోగిని

బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

‘వారంలో ఏడు రోజులూ సెలవులు లేకుండా గడిచిపోతున్నాయి.. వీసీలు, టీసీలు, రెవెన్యూ క్లినిక్‌లు అంటూ ఒత్తిడి తెస్తుంటే మా జాబ్‌చార్టు కూడా మర్చిపోతున్నాం..’ అంటూ ఓ రెవెన్యూ ఉద్యోగిని కలెక్టర్‌ ముందే వీడియో కాన్ఫరెన్స్‌లో గగ్గోలు పెట్టారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో.. టెక్కలికి చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వెళ్లగక్కారు. జిల్లా ఉన్నతాధికారులు పని ఒత్తిడి చేస్తున్నారని, ఒక పని పూర్తికాకముందే మరో పని చెబుతున్నారని, సమయం ఇవ్వడం లేదని, రెవెన్యూకి సంబంధం లేని పనులు కూడా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీలు టీసీలతో అసలు కార్యాలయంలో పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. పని చెప్పడం తప్ప తమ సమస్యలు

వినడం లేదన్నారు. దీంతో వీసీ మధ్యలో ఆమె మైక్‌ను మ్యూట్‌లో ఉంచి ఇతరులకు ఆమె మాటలు వినిపించకుండా చేశారు. కానీ దాదాపు రెవెన్యూ ఉద్యోగులందరిదీ అదే ఆవేదన అని సిబ్బంది తెలిపారు.

– శ్రీకాకుళం పాతబస్టాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement