ఏం కష్టమొచ్చిందో.. | - | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చిందో..

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

ఇద్దరు పిల్లలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

ఘటనా స్థలంలోనే వివాహిత మృతి

తీవ్రంగా గాయపడిన పిల్లలు

నరసన్నపేట: పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయే తల్లి ఏకంగా ఆ పిల్లలను రైలు కింద తోసింది. తానూ చనిపోవాలని అనుకుంది. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటనలో తల్లి చనిపోగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

కంబకాయ రైల్వే గేటు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం టౌన్‌కు చెందిన కొత్తపల్లి జ్యోతి(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇద్దరు పిల్లలతో ఆమె విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా జ్యోతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇద్దరు పిల్ల లు హేమంత్‌, పునీత్‌లు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలిచి వేసింది. అయితే లోకోపైలెట్‌ మానవతా దృక్పథంతో ట్రైన్‌ను ఆపి గాయపడిన ఇద్దరు పిల్లలను ఆమదాలవలస రైల్వే పోలీసులకు అప్పగించారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది.

జ్యోతిది కంబకాయ గ్రామం. పదేళ్ల కిందట వివాహమైంది. భర్తతో నిత్యం ఘర్షణలు పడుతూ మంగళవారం ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు కాగా పెద్దబ్బాయి హేమంత్‌కు కుడి కాలు విరిగిపోగా చిన్నబ్బాయి పునీత్‌ ఎడమ కాలికి గాయాలయ్యా యి. వీరిని శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒకరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆమదాలవలస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement