‘సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పండి’ | - | Sakshi
Sakshi News home page

‘సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పండి’

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ మున్సిపల్‌ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యా శా ఖ అధికారి ఎ.రవిబాబు కోరారు. మంగళవా రం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ త్వ రలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్న దృష్ట్యా ఎస్జీటీ స్కూల్‌ అసిస్టెంట్‌ సీనియార్టీ జాబితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ఉపాధ్యాయులు దీన్ని పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల ఆరో తేదీలోగా డీఈఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.

ఐసీడీఎస్‌కు పసికందు అప్పగింత

పాతపట్నం: మండలంలోని బూరగాం గ్రామంలో ఈ నెల 30వ తేదీన ఇంటి పెరట పొదల్లో దొరికిన వారం రోజుల పసికందును జిల్లా ఐసీడీఎస్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. పొదల్లో పసికందు దొరికిన విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌, పోలీసులు, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ అధికారులు మంగళవారం బూరగాం గ్రామానికి చెరుకున్నారు. గ్రామానికి చెందిన దేవకి సోయి, సుబాచంద్ర సోయి దంపతుల వద్ద ఉన్న పిల్లాడిని ఎస్‌ఐ కె.మధుసూదనరావు, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ అమరావతి, ఐసీపీఎస్‌ జనార్ధనరావు, వైకుంఠరావు, సెక్రటరీ ఉదయ్‌శ్రీ, వీఆర్వో వెంకటరావు, సర్పంచ్‌ బిజిలి పుల్లాయ్‌, ప్రహ్లాద పుల్లాయ్‌, నర్సునాయుడు, గ్రామ పెద్దల సమక్షంలో జిల్లా ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. పసికందును సోమవారం రాత్రి విడిచి వెళ్లిన వారిపై మంగళవారం ఉదయం పోలీసులు గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. అంగన్‌వాడీ కార్యకర్త పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా మని ఎస్‌ఐ కె.మధుసూదనరావు తెలిపారు.

ఘనంగా ఆదిత్యుని రథోత్సవం

శ్రీకాకుళం కల్చరల్‌: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్వామి ఉష పద్మిని ఛాయా సమేత రథోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నిత్యౌపాసన, విశేషపూజ, మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement