చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం | Dharmana Prasada Rao comments over amravati | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం

Apr 8 2026 4:28 AM | Updated on Apr 8 2026 4:28 AM

Dharmana Prasada Rao comments over amravati

శివరామకృష్ణన్‌ కమిటీని కూడా కాదని ఏకపక్ష నిర్ణయం సరికాదు

అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా?

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం 

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తు­న్నా­రని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫ­లాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడా­రు. 

రాజధాని విషయంలో కూటమి ప్రభు­త్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీ­కృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ చుట్టూనే అభి­వృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్య­మం వచ్చి రాష్ట్రం విడిపోడా­నికి కారణ­మైందని గుర్తుచేశారు. ఇప్పు­డు చంద్రబా­బు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు. 

భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది 
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిటీ రాజధానికి అమ­రావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వస­తులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్ల­మెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చే­యించారని, ఇది భవిష్యత్‌లో అనేక సమస్యలకు దారి­తీస్తుందన్నారు. 

అమరావతిలో కనీస మౌలిక వస­తు­ల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని  ము­ఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతా­ల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్ర­శ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించారని చెప్పారు.  

80 ఏళ్లయినా ఇంకా వలసలేనా? 
ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వె­నుక­బడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్ర­బాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించా­రు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏ­ళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. 

రాష్ట్ర బడ్జెట్‌ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటా­యించరా?­అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నా­రని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్‌ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏ­నా­డైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement