శ్రీకాకుళం పాతబస్టాండ్:
రబీ వరి పంటకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని తక్షణమే అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని భగీరథపురం, దోమలపల్లి, అక్కరపల్లి, పిండ్రువా డ, కరకవలస, ముఖలింగం, నగిరి కటకం, మర్రివలస తదితర గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో సుమారు 15000 ఎకరాల్లో వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, ఈ కీలక సమయంలో నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్, మండల అధ్యక్షులు కనుసు సీతారాం, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు, మండల ఉప అధ్యక్షులు బసవ రమణమూర్తి, సీపాన మోహన్,తోట భార్గవ్, కనపల అరవింద్, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


