పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురు జోల, సింగిపూర్ తదితర సరిసరాల్లో 1,080 లీటర్ల నాటు సారా, 10,500 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, ఉదయ్‌గిరి, కాశీనగర్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.


