కవిటి: మండలంలోని మాణిక్యపురం పీహెచ్‌సీలో ప్రభుత్వం అందించిన నిధుల వినియోగం తదితర అంశాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బుధవారం విచారణ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.ఆర్.రాందాస్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా.కె.మేరీ క్యాథరిన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్.రాంబాబుల నేతృత్వంలో విచారణ జరిపారు. దీనిలో భాగంగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. నిధుల వినియోగానికి సంబంధించి బాధ్యులుగా ఉన్న సంబంధిత అధికారుల నుంచి వివరాలను రాబట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని తెలిపారు. విచారణలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


