‘నీరు’పయోగమేనా..? | - | Sakshi
Sakshi News home page

‘నీరు’పయోగమేనా..?

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● అభివృద్ధికి నోచుకోని అక్కలగెడ్డ ● నామ మాత్రంగా మిగిలిన గెడ్డ ● పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు మత్తుకు అలవాటు కావద్దు

ఎండాకాలంలో కూడా నీరు ఉండేది

మరమ్మతులు చేయాలి

● అభివృద్ధికి నోచుకోని అక్కలగెడ్డ ● నామ మాత్రంగా మిగిలిన గెడ్డ ● పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

కొత్తూరు: యువత మత్తుకు అలవాటు కా వద్దని స్థానిక ఎస్‌ఐ కె.వెంకటేష్‌ అన్నారు. కొత్తూరులోని రాజు వీధిలో బుధవారం రాత్రి సంకల్పం కార్యక్రమం నిర్వహించా రు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం అంధకారమవుతుందన్నారు.

పలాస: ఉద్దానం ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే అక్కల గెడ్డ నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారింది. ఈ గెడ్డ పలాస వజ్రపుకొత్తూరు మండలాల రైతులకు సుమారు 20వేలు ఎకరాలకు సాగునీరు అందించేది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు తాగు నీరు కష్టాలను కూడా గతంలో తీర్చింది. ఇంతటి ప్రాధాన్యత గల అక్కల గెడ్డ నేడు నిర్లక్ష్యానికి గురైంది. ఇరిగేషన్‌ అధికారులు ఈ గెడ్డ ఉందన్న సంగతే మరిచి పోయారు. గత కొన్నేళ్లుగా గెడ్డలో పూడిక పేరుకు పోవడంతో పాటు, మొగిలి డొంకలు, ఇతర పిచ్చి చెట్లు మొలిచిపోయి అవి పెద్దగా తయారై ఇప్పుడు అక్కడ గెడ్డను పూర్తిగా కప్పేశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పలాస మండలం మాకన్నపల్లి గ్రామం చింతల గుండం చెరువు నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ పలాస రైల్వే లైను పక్క నుంచి వస్తోంది. పెంటిభద్ర కొండ, బొడ్డపాడు చీపురు బంద, జగ్గోరు చెరువు, గరుడభద్ర ఎంకాయ చెరువులు నిండి వర్షాకాలంలో పొలాల మీదుగా ఈ గెడ్డలోకి నీరు ప్రవహించేది. వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు, గరుడభద్ర, రిట్టపాడు, రాజాం, తాళభద్ర తదితర గ్రామాల రైతులకు సాగు నీరు అందించేది. అంతేకాకుండా పశువులకు ఎక్కువగా ఉపయోగపడేది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ గెడ్డను సంబంధిత అధికారులు పూర్తిగా మరిచి పోయారు.

దీంతో గెడ్డ ఆనవాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. దీంతో ఈ గెడ్డపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ గెడ్డపై దృష్టి సారించి పూడిక తీసి, పెరిగిపోయిన చెట్లను తొలగించాలని రైతులు కోరుతున్నారు.

ఇది ఊట గెడ్డ. ఎండాకాలంలో కూడా నీరు ఉండేది. ఇది ఎంతో రైతులకు ఉపయోగ పడేది. మాకన్నపల్లి చింతల గుండం నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ రిట్టపాడు మీదుగా నువ్వల రేవు వద్ద సముద్రంలో కలిసేది. ఎప్పుడు కూడా నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యం వల్ల గెడ్డ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వర్షాలు పడితే అక్కల గెడ్డ మీదుగా ధర్మపురం తాళభద్ర మద్య రోడ్డు పూర్తిగా జలమయమై పోతుంది. తక్షణమే ఈ గెడ్డను బాగు చేయాలి.

– తామాడ సన్యాసిరావు, రైతు, బొడ్డపాడు, పలాస మండల

ఉద్దానం ప్రాంత రైతులకు ఏకై న సాగునీటి వనరు ఈ అక్కల గెడ్డ. దీనికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఈ గెడ్డపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సాగు నీటి కష్టాలు ఏటా తప్పడం లేదు. పూడిక తీయాలి. పిచ్చిమొక్కలు, మొగిలి డొంకలను తొలగించాలి.

– వంకల అప్పారావు,

రైతు, మామిడిపల్లి, పలాస మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement