పోర్టు నిర్మాణంలో వాస్తవాలను వివరిస్తాం
● మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు
● పోర్టు పనుల ఘనత వైఎస్ జగన్‌దే
● నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం
పదండి’ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
● జనాలకు వాస్తవాలు చెప్పడానికి
సిద్ధమవుతున్న నాయకులు
– సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం
మూలపేట పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కమిషన్ల లావాదేవీల కోసం కాలయాపన చేశారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధితో పాటు జిల్లాను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా పోర్టుకు శ్రీకారం చుట్టిన గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే ఈ ఘనత అని నిరూపిస్తాం.
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ టెక్కలి
నియోజకవర్గ ఇన్‌చార్జి
● వైఎస్సార్‌సీపీ ఉన్నప్పుడు రూ.4361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ 19వ తేదీన శంకుస్థాపన చేశారు.
● మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీ, మౌలిక సదు పాయాల కోసం నౌపడ సమీపంలో రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రోడ్డు కోసం రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు.
● రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను రైతుల అంగీకారంతో సేకరించారు.
● ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు.
● కేవలం ఏడాది కాలంలోనే అనగా ఎన్నికల సమయానికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులతో పాటు కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డు నిర్మాణం, బ్లాచింగ్ చిప్స్ ప్లాంట్ నిర్మాణంతో పాటు డ్రెడ్జింగ్ పనులతో సహా 70 శాతం పనులు పూర్తి చేశారు. మరో వైపు రోడ్డు పనులు ప్రాథమిక స్థాయిలో పూర్తి చేశారు.
పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ఫైల్)


