ఉత్సాహంగా చెస్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా చెస్‌ ఎంపిక పోటీలు

Mar 30 2026 7:30 AM | Updated on Mar 30 2026 7:30 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్‌లోని కాశ్యప్‌ నర్సింగ్‌ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్‌–9 చెస్‌ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్‌, శనుగును శివ, సనపల రిత్విక్‌సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్‌–9 బాలబాలికల చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్‌ ఆన్‌ స్కూల్‌ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్‌ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బగాది కిషోర్‌, కార్యదర్శి జామి రమేష్‌, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.

జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి

కొండపల్లి రాక నేడు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు విజయనగరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. జీరో పావర్టీ పీ–4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో విజయనగరం చేరుకుంటారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement