ఉద్యోగి.. ఉక్కిరి బిక్కిరి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగి.. ఉక్కిరి బిక్కిరి

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారు. ఖాళీ లేకుండా ఏదో ఒక బాధ్యత అప్పగించడం, దానికి డెడ్‌లైన్‌ పెట్టడం, జిల్లా అధికారులు సతాయింపునకు గురి చేయడంతో నలిగిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ఇదే జరుగుతుందన్న ఆలోచనలో పడ్డారు. కాన్ఫరెన్స్‌లు, సమీక్షలతోనే గడిచిపోతుందని, పనిచేయడానికి సమయం ఎక్కడ ఉంటుందని ఆవేదన చెందుతున్నా రు. ఓపిక నశించడంతో ఎదురు ప్రశ్నించక తప్పడం లేదు. ఇటీవల కలెక్టర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓ మహిళా ఉద్యోగి నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రశ్నలకు స్పందించలేక మ్యూట్‌లో పెట్టేసి వీడియో కాన్ఫరెన్స్‌ కొనసాగించారు.

ఒక మహిళా ఉద్యోగి నేరుగా కలెక్టర్‌తోనే తీవ్ర స్వరంతో మాట్లాడారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు రోడ్డెక్కారు. ముఖ్యంగా అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ధాన్యం సేకరణ సమయంలో కలెక్టరేట్‌ను ముట్టడించడమే కాకుండా ఏకంగా కలెక్టర్‌నే నిలబెట్టేశారు. సర్వే ఉద్యోగుల పరిస్థితి కూడా దాదా పు అంతే. మొన్నటి వరకు సచివాలయం ఉద్యోగులే ఇబ్బందులు పడుతున్నారనుకుంటే ఇప్పుడా జాబితాలోకి రెవెన్యూ ఉద్యోగులు కూడా చేరారు. ఈ రెండు శాఖల్లోనే కాదు దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మధ్య ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభుత్వం పెట్టిన టార్గెట్‌లతో ఒత్తిడికి గురై గుండెపో టుతో చనిపోయారు. సచివాలయం ఉద్యో గుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నారు. చెప్పాలంటే ఏ ఒక్క ఉద్యోగినీ ప్రభుత్వం వదలడం లేదు.

గత ప్రభుత్వం ప్రశాంత వాతావరణం మధ్య చేపట్టిన భూముల రీసర్వేను ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడదే రీసర్వేను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం మొదలు పెట్టింది. తాము చేస్తే పని.. వేరే వాళ్లు చేస్తే నేరమని తన సహజ ధోరణి ప్రదర్శించింది. నాలుక మడత పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రీసర్వేను తాజాగా చేపడుతోంది. కాకపోతే, అందుకు అవసరమైన వనరులను సమకూర్చలేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బేస్‌ స్టేషన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన రోవర్లు, కొలతలకు సంబంధించిన పరికరాలు, కంప్యూటర్లు ఇవ్వలేదు. వాటి సమస్య తీవ్రంగా ఉంది. సర్వే చేసేందుకు సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దాన్ని అధిగమించకుండా సర్వే పేరు తో ఉన్న ఉద్యోగులను వేధింపులకు గురి చేసి, ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. 10 రోజుల కిందట గ్రామ సర్వేయర్లు సామూ హికంగా సర్వే నిలిపివేశారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. కాకపోతే, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు, వ్యతిరేకత వస్తాయని గమనించి ప్రభుత్వం వెంటనే సస్పెన్షన్‌ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

హంగామా..

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. కేవలం హంగామా తప్ప ఏమీ జరగడం లేదు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులకు ఫలి తం ఉండటం లేదు. ప్రధానంగా 22ఎ సమస్యలు, ఎల్‌పీఎం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు సంబంధించి మ్యుటేషనుల, కరెక్షన్స్‌, అడంగల్‌లో పేరు మార్పు లు వంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. కోర్టు ఉన్న సమస్యలకు సరైన సమాధానాలు పంపకపోవడంంతో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ రెవెన్యూ ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీనితో పాటు అడ్డగోలు పనులు చేయాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వారు చెప్పిన పనులే చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో కింది స్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పింది చేయకపోతే నేతలు సతాయిస్తున్నారు. ఇటీవల గార తహసీల్దార్‌ అంతకుముందు పాతపట్నం తహసీల్దార్‌పై నేతలు చిందులు వేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

రెవెన్యూ ఉద్యోగులు వారి విధుల నిర్వహణ కంటే ఎమ్మెల్యేలు, మంత్రుల వారి ప్రొటోకాల్‌ పనుల తో బిజీ కావల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరు కాకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. దీంతో తహసీల్దార్లు, ఇతర అధికారులు, సచివాలయం ఉద్యోగులు వారి చుట్టూ తిరగడంతోనే సమయమైపోతోంది. పరిస్థితులు ఇలా ఉన్నా ఉన్నతాధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. చెప్పింది ఎందుకు చేయలేదని నిరంతరం నిలదీస్తున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు.

ఊపిరి సలపనివ్వడం లేదని ఆవేదన

వరుస బాధ్యతల అప్పగింతపై ఆందోళన

నేతల ఒత్తిళ్లు, అనధికార హుకుం

సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితి

జాప్యంపై ఉన్నతాధికారుల చీవాట్లు భరించలేక ఆవేదన

ఒత్తిడి తట్టుకోలేక ఆకస్మిక మరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement