ఆ దంపతుల నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

ఆ దంపతుల నేత్రాలు సజీవం

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

ఆ దంపతుల నేత్రాలు సజీవం

శ్రీకాకుళం కల్చరల్‌: ‘నేత్రదానం’ వెలుగుల దానమ ని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు శనివారం పేర్కొన్నారు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన అంధవరపు బాలకృష్ణమూర్తి (88) గత నెలలో మరణించడంతో కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్‌ ద్వారా నేత్రదానం చేశారు. ఆయన భార్య అంధవరపు రూపవతి (82) తన భర్త నేత్రదానం నుంచి ప్రేరణ పొంది మరణానంతరం నేత్రదానం చేయాలని కుమారులకు తెలియజేసి శనివారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు అంధవరపు రాఘవ్‌కుమార్‌, శ్రీనివాస నెహ్రూ, వి.సుజాతలు నేత్రదానానికి ముందుకొచ్చారు. మగటపల్లి కల్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్‌ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్‌.వి.ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్ర దానం చేయాలనుకునే 78426 99321 నంబరుకు సంప్ర దించాలని జగన్మోహనరావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement