కళంకితుడిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కుర్చీలో కొనసాగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తిని వెంటనే ఆ పదవి నుంచి సాగనంపాలని కోరుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా దేవాలయాల వద్ద పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని, బీఆర్ నాయుడుకు ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే అపవిత్రం చేస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. –సాక్షి నెట్‌వర్క్


