130కు చేరిన బాదంపాలు బాధితులు | - | Sakshi
Sakshi News home page

130కు చేరిన బాదంపాలు బాధితులు

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

130కు చేరిన బాదంపాలు బాధితులు బాదం పౌడర్‌ దుకాణాల్లో తనిఖీలు

శ్రీకాకుళం రూరల్‌ : సింగుపురంలో రెండు రోజుల క్రితం జరిగిన హాటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్రలో బాదంబాలు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 130 మందికి చేరింది. ఇప్పటికే బాధి తుల్లో కొందరికి సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే కోలుకుంటున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మామిడివలసకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

ల్యాబ్‌లకు శాంపిళ్లు..

ఇదే విషయమై కలెక్టర్‌ స్వప్నిల్‌ స్పందిస్తూ బాధితులంతా సురక్షితంగానే ఉన్నారని, బాదం పాలు, కస్టర్డ్‌ పౌడర్‌ నమూనాలను పరీక్షల నిమిత్తం విశాఖ, హైదరాబాద్‌ పంపించామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ, ఆహార భద్రతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షిస్తున్నారని తెలిపారు. బాదంపాలు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పరిధిలో బాదం పౌడర్‌ విక్రయించే పలు దుకాణాల్లో ఆహార తనిఖీ అధికారులు పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సింగుపురంలో బాదంపాలు తాగి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కోట లక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement