జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ చాపరలో బైక్‌ దొంగల హల్‌చల్‌! విద్యార్థినులకు పాలిసెట్‌లో ఉచిత శిక్షణ

శ్రీకాకుళం: జిల్లా పరిషత్‌ సీఈఓగా వెంకట్రామన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలో ఇన్‌చార్జి సీఈఓ గా పనిచేస్తున్న వెంకట రామన్‌ను పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ సీఈఓగా ప్రభుత్వం మూడు రోజుల కిందట నియమించిన విష యం పాఠకులకు విధితమే. ఆయన శనివారం బాధ్యతలు తీసుకున్నారు.

మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న చాపర గ్రామంలో అర్ధరాత్రి ద్విచక్రవాహనాలు దొంగతనం చేసే వ్యక్తులు తిరుగుతున్నారంటూ శనివారం సీసీ ఫుటేజ్‌ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. బైక్‌ చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కుక్కలు మొరగడంతో పారిపోయా రు. ఇదిలా ఉండగా శనివారం అదే గ్రామానికి చెందిన కిల్లంశెట్టి జగదీశ్వరావు తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మహమ్మద్‌ అమీర్‌ అలీ తెలిపారు. చాపర గ్రామంలో నెల క్రితం కూడా రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

ఎచ్చెర్ల : స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో విద్యార్థినులకు పాలిసె ట్‌ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ విక్టర్‌పాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం నుంచి శిక్షణ ప్రారంభమౌతుందని, ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఆధార్‌ కార్డు, పదో తరగతి హాల్‌ టికెట్‌, పాలిసెట్‌ ఫీజు రసీదుతో వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పాలిసెట్‌కు అప్లయ్‌ చేసేందుకు ఈ నెల 9 వరకు గడువు పొడిగించారని చెప్పారు. పూర్తి వివరాలకు 9440951078 నంబరును సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement