శ్రీకాకుళం అర్బన్: నూతన ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతికోద్యమం లక్ష్యంగా గత ఐదు దశాబ్దాలుగా జన సాహితీ అలుపెరుగని కృషి చేస్తోందని జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో జనసాహితీ ప్రజా సాహిత్య సాంస్కృతిక పోరా ట సమితి ఆహ్వాన సంఘ ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివి కుమార్ మాట్లాడుతూ తొలి తెలుగు జాతి వైతాళికుడు ప్రసి ద్ధి పొందిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిది మన ప్రాంతమేనన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ ఆనాడు వద్దు వద్దు అని చెప్పిన తెల్ల దొరతనం నేటి నల్ల దొరల సౌజన్యంతో పరోక్షంగా కొనసాగుతూనే ఉందని అన్నారు. మనం చమురు ఎవరి దగ్గర కొనుక్కోవాలో, కొనుక్కోకూడదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడం ఏమిట ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక ఉద్యమ రంగంలో రాష్ట్ర మహాసభలు జరుపుకునే సందర్భంలో మే 24, 25 తేదీల్లో శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున 13వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. గోర్కీ రచించిన అమ్మ నవలలను నాటకంగా మే 24న అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.


