శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలి ఏవో హైమావతిపై విచారణకు ముగ్గురు అధికారుల కమిటీని కలెక్టర్ నియమించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక అందోళనలను ఉన్నతాధికారులకు నివేదించడంపై ఈ కమిటీని నియమించారు. కమిటీలో ఎస్‌డీసీ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మలు ఉన్నారు. కాగా విచారణ కమిటీ నియామకంపై రెవెన్యూ వర్గాల్లో చర్చ మొదలైయింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడడం తప్పుబట్టి విచారణ చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
10 నుంచి నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: ఈనెల 10వ తేదీ నుంచి బాపూజీ కళామందిర్‌లో శ్రీముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనునట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు బ్రోచర్‌ను బుధవారం విడుదల చేశారు. రోజుకు రెండు నాటికల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 12న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.శ్యామ్ కుమార్, పొగిరి సత్యం, రమేష్, ప్రసాద్‌దు, కీర్తి, కుమారి, సంతోషి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోండి
టెక్కలి: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు. బుధవారం కోటబొమ్మాళిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్‌పై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కె.హరివరప్రసాద్, నాయకులు బి.గోవిందరాజులు, బి.రమేష్, వి.విజయలక్ష్మి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.


