ఫ్రైడే | - | Sakshi
Sakshi News home page

ఫ్రైడే

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

ఫ్రైడే మనసు లేని ప్రభుత్వం

ఫ్యూనరల్‌ చార్జీలు చెల్లించలేని దుస్థితిలో సర్కారు జిల్లాలో 615 కుటుంబాల ఎదురుచూపులు

రూ.1.53 కోట్ల మేర బకాయిలు

అర్జిత సెలవుల డబ్బు కూడా పెండింగ్‌లోనే

మనసు లేని ప్రభుత్వం

జిల్లాలో ఎండ మండిపోతోంది. మధ్యాహ్నానికి సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో వాహన చోదకులు, బయట పనిమీద వెళ్లిన వారు తీవ్రంగా ఇబ్బంది

పడుతున్నారు. శుక్రవారం సూరీడి ధాటికి జనం

చెమట్లు కక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

శ్రీకాకుళం పాత బస్టాండ్‌:

ఫ్యూనరల్‌ చార్జెస్‌.. ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారికి ప్రభుత్వం న్యాయంగా అందజేయాల్సిన సాయం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సాయం కూడా చేయలేకపోతోంది. దాదాపు ఏడాదిగా ఈ మట్టి ఖర్చులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఆయా బాధిత కుటుంబాలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఏడాదిగా జిల్లాలో మరణించిన ఒక్క ఉద్యోగికి కూడా ఈ ఫ్యూనరల్‌ చార్జీలు అందజేయలేదు. వారు ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడమే మిగిలింది తప్ప నగదు మాత్రం వారి ఖాతాలకు జమ కాలేదు. ఒకప్పుడు ఉద్యోగి, ప్రభుత్వ పింఛన్‌దారుడు మరణిస్తే 24 గంటల్లో వారి కుటుంబానికి ఫ్యూనరల్‌ చార్జీలు రూ.25వేలు అందజేసేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నెలలు, సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మట్టి ఖర్చులు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 615 మంది వరకు ఇలాంటి మట్టి ఖర్చులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ నగదు విడుదల జరగలేదని ట్రెజరీ అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపు రూ.1.53 కోట్ల బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి.

ఆర్జిత సెలవుల డబ్బులకు

అతీగతీ లేదు

ఉద్యోగులకు గౌరవప్రదంగా అందజేయాల్సిన ఆర్జిత సెలవుల డబ్బులు(ఎర్న్‌డ్‌ లీవ్‌ అమౌంట్‌) చెల్లింపులు కూడా జరగడం లేదు. ఇలాంటి ఆర్జిత సెలవు నగదు కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 500 కు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరు ఏడాదిగా ఆ మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్జిత సెలవుల నగదు చేతికి అందితే పిల్లలకు ఉపాధి కార్యక్రమాలు, వివాహాలు ఇతర అవసరాలకు పనికి వస్తాయని ఉద్యోగులు ఆశ పడుతుంటారు. కానీ వారికి నిరాశే మిగిలింది. దాదాపు రూ.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గ్రాడ్యు టీ నగదు కూడా చెల్లింపులు జరగడం లేదు. ఈ బకాయిలు కూడా రూ.కోట్లలో ఉన్నాయి. జిల్లాలో వందలాది కుటుంబాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కొందరు న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement