జలుమూరు: మండలంలోని తిమడాం పంచాయతీలో ఒక టీడీపీ నాయకుడు ప్రభుత్వ చెరువు(దుబ్బోడో) సర్వే నంబర్ 85లో ఇంటి నిర్మాణంతోపాటు గట్టును మట్టితో కప్పి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ఈ చెరువు గట్టు మీద చాలా వరకూ ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒక ఇంటి స్థలం సుమారు రూ.5 లక్షలు వరకూ పలకుతుండడంతో ఆక్రమణలుదారులు యథేచ్ఛగా గట్టును మట్టితో కప్పుతున్నారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు వద్ద ప్రస్తావించగా.. సిబ్బందిని పంపి ఆక్రమణలు తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


