మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ

Apr 8 2026 7:32 AM | Updated on Apr 8 2026 7:32 AM

కంచిలి: కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌, న్యూఢిల్లీ వారు నిర్వహించిన మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌–2025 పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. వీటిని సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌.చాణక్య, మిగతా ఉపాధ్యాయులు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. బంగారు పతకాలను సాయి కిషోర్‌ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియా యువశ్రీ, రజిత పతక విజేతలైన మారేడు దీపిక, నక్క పవన్‌, గణప అవంతిక, కొండా శ్యాం, కాంస్య పతక విజేతలైన లోపింటి ధనలక్ష్మి, గుడియా చరణ్‌, గగన్‌ పాత్రో, లండ ప్రసాద్‌రెడ్డి, యజ్జల పూజ ఉన్నారు. ఒలింపియాడ్‌ కోసం ప్రత్యేక తర్ఫీదునిచ్చిన గణిత ఉపాధ్యాయులు అశోక్‌ కుమార్‌, సూర్యప్రకాశ్‌, ప్రసాదరావు, సుధాకర్‌లను హెచ్‌ఎం సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement