గంజాయితో ముగ్గురు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయితో ముగ్గురు అరెస్టు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

పలాస: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 7.610 కిలోల గంజాయిని, మూడు సెల్‌ఫోన్లు, రూ.800ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా చార్‌రాస్తాకు చెందిన గౌతం గోపాల్‌ ఠాకూర్‌, వీరేంద్రనగర్‌కు చెందిన రాజేష్‌ అశోక్‌ తోడిలు ఒడిశా వెళ్లి అక్కడ రాయగడ ప్రాంతంలోని బర్తింగ్‌డూడకు చెందిన జగన్‌ సాబర్‌ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అతని సాయంతో పర్లాకమిడి నుంచి బస్సులో పలాస రైల్వేస్టేషన్‌కు మంగళవారం వస్తుండగా.. సాయిబాబా మందిరం వద్ద వారిని కాశీబుగ్గ ఎస్‌ఐ ఆర్‌.నర్సింహమూర్తి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారినుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement