నాటిక పరిషత్‌ పోటీల విజేత హైదరాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నాటిక పరిషత్‌ పోటీల విజేత హైదరాబాద్‌

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

కవిటి : మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల పరిషత్‌ నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు మానాపురం సత్యన్నారాయణ, బల్లెడ మోహనరావు, ఎల్‌.రామలింగ స్వామిలు ఫలితాలు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌ గోవాడ ఆర్ట్స్‌ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయా ఆర్ట్స్‌ గుంటూరు వారి ‘సహాన’, తృతీయ స్థానంలో కరీనగర్‌ చైతన్య కళాభారతి వారి స్వప్నం కురిసిన అమృతం నిలిచాయి. ఉత్తమ సంగీతం సహాన నాటికలో లీలామోహన్‌, ఉత్తమ రంగాలంకరణ రమణ అప్పారావు(చిటికెనవేలునాటిక), ఉత్తమ ఆహార్యం మా ఇంట్లో మహాభారతం చిత్రాలకు దక్కాయి. స్వర్గీయ బెందాళం ప్రకాష్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రముఖ రంగస్థల నటుడు యడ్ల గోపాలం, ప్రముఖ సంగీత కళాకారునిగా గుర్తింపు పొందిన బొంతలకోటి కృష్ణారావుకు నిమ్మన పురుషోత్తం లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రధానం చేశామని కళింగసీమ కళాపీఠం అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement