శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ‘డెడికేటెడ్ కమిషన్’ను నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆది వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘ట్రిపుల్ టెస్ట్’ నిబంధనలను అనుసరిస్తూ, బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర అనుభవ ఆధారిత విచారణ చేపట్టేందుకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిషన్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు వివిధ స్టేక్ హోల్డర్లు, సంస్థలు, వ్యక్తుల నుంచి లిఖితపూర్వక వినతిపత్రాలను ఆహ్వానిస్తోందని వివరించారు. ఈ అంశంపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఈ నెల 30వ తేదీలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ‘సెక్రటరీ, డెడికేటెడ్ కమిషన్, డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం, 1వ అంతస్తు, మొఘల్రాజపురం, విజయవాడ – 520010’ చిరునామాకు పంపాలి. అలాగే ఈ మెయిల్ ద్వారా కూడా వివరాలు పంపవచ్చు. ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు సమర్పించాలనుకునే వారు కమిషన్ కార్యదర్శిని ( 901 0400500) లేదా సంబంధిత అధికారిని (798 9344521) సంప్రదించి ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఆయన వెల్లడించారు.
ఎండలో భక్తుల అవస్థలు
అరసవల్లి: సూర్య నారాయణ స్వామి క్షేత్రంలో భక్తులు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టార్పాన్లు నాసిరకానివి కావడంతో ఎక్కడికక్కడ చిరిగిపోయి తెగిపడ్డాయి. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పా టు చేసిన టార్పాలిన్లు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఇక ఆలయం నుంచి బయట ప్రాంతంలో కూడా టెంట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు.
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం రూరల్: మండలం ఎం.తోటూరు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ గేటు వద్ద రూరల్ ఎస్‌ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్‌ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 2.100 కిలోల గంజాయి, రెండు మొబై ల్ ఫోన్‌లను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన పత్రి కా సమావేశంలో సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ గంజాయికి అలవాటుపడిన భుక్త బలరాం, బింగి కుమార్‌లు వారు పనిచేసే అచ్యుతాపురం పట్టణంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అధిక ధరలకు అమ్ముకుంటుంటారని తెలిపారు. బరంపురానికి చెందిన గంజాయి వ్యాపారి నిలంచల వద్ద రూ.3వేలుకు రెండు కిలోలు కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో ఎల్‌సీ గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


