మీకు నీరు.. మాకు కన్నీరా..? | - | Sakshi
Sakshi News home page

మీకు నీరు.. మాకు కన్నీరా..?

Apr 8 2026 7:08 AM | Updated on Apr 8 2026 7:08 AM

● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న

ఆఫ్‌షోర్‌ నిర్వాసితులు

● గ్రామాలను త్యాగం చేసి,

న్యాయం కోసం దీక్షలు

● నేటికీ 132 కుటుంబాలకు

అందని పరిహారాలు

● 300 రోజులుగా దీక్షలు

● పట్టించుకోని అధికారులు, నాయకులు

వలస కూలీలమని..

నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నా. వలస కూలీగా ఉన్నానని, అధికారుల తప్పుగా నమోదు చేయడం వల్ల నాకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. నేనెలా బతకాలి. అధికారులు నాకు న్యాయం చేసి పరిహారం ఇప్పించాలి.

– ఇప్పిలి వరలక్ష్మీ, చీపురుపల్లి గ్రామం

గ్రామాన్ని ఇచ్చి దీక్షలు చేయాలా..?

సర్వస్వం అర్పించాం. గ్రామాలను విడిచి కన్నీటితో బయట బతుకుతున్నాం. నా కుటుంబానికి ఒక్క పైసా ప్యాకేజీ రాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. నిర్వాసితుడినైనా పరిహారానికి నోచుకోలేదు. న్యాయం కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఎదురైంది.

– నందిగాం భాస్కరరావు, చీపురుపల్లి గ్రామం

మెళియాపుట్టి: మండలంలోని ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు భూములు, ఇళ్లు, గ్రామాలను సైతం త్యాగం చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కే దుస్థితి దాపురించింది. మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవరచీపురుపల్లి గ్రామాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఆఫ్‌షోర్‌ రిజ ర్వాయర్‌లో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాలు ఉండడంతో నిర్వాసితులకు న్యాయపరంగా వారికి ప్యాకేజీలు అందించాల్సి ఉంది. అయితే వారికి తగిన న్యాయం జరగకపోవడంతో వారు నిరాహార దీక్షలు ప్రారంభించారు. మే 22న చీపురుపల్లి గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. నేటికి 300 పైచిలుకు రోజులైనా స్పందించే వారే కరువయ్యారని నిర్వాసి తులు వాపోతున్నారు. అర్హులైన 132 మందికి నేటికి కూడా పరిహారాలు అందలేదు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టాభూములకు సైతం పరి హారం అందించలేదని నిర్వాసితులు తెలిపారు. అంతేకాకుండా సుమారు 240 మంది యువతకు ప్యాకేజీలు అందించలేదని, 360 కుటుంబాలకు 5 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని, హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని అన్నారు. చెల్లింపు ల్లో తేడాలు ఉన్నాయని, వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని యవ్వారి ఈశ్వరరావు, నందిగాం జగన్నాయకులు, గుమ్మడి మల్లేసు, నందిగాం హేమలత, చిన్నమ్మి, కొక్కిరి కిరణ్‌, ఉమాశంకర్‌, వెంకటరమణతోపాటు పలువురు నిర్వా సితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిర్వాసిత గ్రామాల్లో ద్విచక్రవాహన ర్యాలీ, స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం, కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, వినతిపత్రం సైతం అందించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని నిర్వాసిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జిల్లా మంత్రు లు, అధికారులు స్పందించి న్యాయం చేయకపో తే పోరాటాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నా రు. వీరు కోర్టుకు కూడా వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement