‘భూ సేకరణ వద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘భూ సేకరణ వద్దు’

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

మందస: మందస మండలం రాంపురం పంచాయతీ పరిధిలో గల తెలగ గంగువాడ గ్రా మానికి చెందిన భూ బాధిత రైతులు, గ్రామ ప్రజలు కార్గో ఎయిర్‌పోర్టుకు తమ వ్యతిరేకత తెలిపారు. మందస ఎమ్మార్వో కార్యాలయంలో, పలాస ఆర్డీఓ కార్యాలయంలో, సచివాలయాలకు వెళ్లి తమ అభ్యంతరాలు తెలియజేస్తూ మెమొరాండంలు సమర్పించారు. భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో చిత్త కూర్మారావు, చిత్త గున్నయ్య, యలమల కృష్ణారావు, చిత్త చంద్రశేఖర్‌, దాసరి మోహన్‌రావు, చిత్త సంతోష్‌, జోగి మోహన్‌రావు, ఆనంద్‌, హేమరాజు, నారాయణ, రాకెట్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

బిల్లు ఆమోదంపై హర్షం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో కేక్‌ కటింగ్‌ నిర్వహించారు. కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2642 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. 2026–27 బడ్జెట్‌ ఔట్‌ రీచ్‌పై ఎమ్మెల్యేలు గౌతు శిరీష, గొండు శంకర్‌లతో కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాలపై వివరిస్తూ జిల్లాకు రూ.2642 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు వివరించా రు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన బడ్జెట్‌ అన్ని వర్గాలకు చేరేలా ఉండాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ బడ్జెట్‌లో ఏడు పథకాలకు కేటాయింపులు చేశామన్నారు. జిల్లా అభివృద్ధి బడ్జెట్‌ను పలు శాఖలకు కేటాయించామన్నారు.

‘మహిళా టీచర్ల సమస్యలపై వినతి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: మహిళా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూటీఎఫ్‌ ఆద్వర్యంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కి వినతి పత్రాలు అందజేశారు. యూటీఎఫ్‌ మహిళా విభాగం జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.తవిటమ్మ, జిల్లా కార్యదర్శులు జి.శారద, సూర స్వర్ణకుమారి, జిల్లా నాయకు లు సీహెచ్‌ సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరి, జహీన రాణి తదితరులు వినతి అందజేసిన వారిలో ఉన్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని, భద్రతా సమస్యలు పరిష్కరించాలని కోరారు. మహిళా టీచర్లకు ప్రత్యేక స్టాఫ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

పలు దుకాణాల్లో చోరీ యత్నం

టెక్కలి రూరల్‌: టెక్కలిలో బుధవారం రాత్రి పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు గురువారం గుర్తించారు. ఆ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తెంబూర్‌ రోడ్డులో గల ఓ మెడికల్‌ షాపులో చోరీ జరిగినట్లు షాపు యజమాని గుర్తించాడు. షాపు షట్టర్‌ తాళాలు బద్దలు గొట్టి షాపులోకి చొరబడి షాపులోని కొంత నగదుని దొంగిలించినట్లు పోలీసులకు తెలిపారు. అలానే ఇందిరాగాంధీ జంక్షన్‌ వద్ద ఒక ఒక చెప్పుల షాపు లో సైతం దొంగతనానికి ప్రయత్నించారని, అయితే ఆ షాపులో ఎలాంటి వస్తువులు గానీ డబ్బులు గానీ చోరీకి గురికాలేదని తెలిపారు. అయితే ఇదే విషయమై పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement