శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026ను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కోడి రామమూర్తి స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ క్రీడల కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, ఎం.కష్ణమూర్తి, ఆర్.అప్పలరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణ, సివిల్ సప్లయ్ డీఎం టి.వేణుగోపాల్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.లావణ్య, ఏపీఆర్‌ఎస్‌ఏ స్టేట్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ వి.వి.ఎన్.రాజు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఐ.లింగ రాజు, ట్రెజరర్ మురళీధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


