కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో మూడు ప్లాట్‌ఫామ్స్ మీద ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అట్టహాసంగా ప్రారంభించిన డిజిటల్ కోచ్ పొజిషన్ డిస్‌ప్లే బోర్డులు పనిచేయడం లేదు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగళూ రు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పుడు డిస్ ప్లే బోర్డులు పనిచేయలేదు. బోర్డులు ఉంటే ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్‌లు ఎక్కేందుకు సౌలభ్యంగా ఉంటుంది. రైల్వే సాంకేతిక అధికారులు స్పందించి కోచ్ పొజిషన్ బోర్డులు బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.


