సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర

కంచిలి: భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్‌కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయం సేవక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు. శుక్రవారం రాత్రి కంచిలి ఊన శ్రీకాంత్‌ ఇంటి వద్ద బస చేసి శనివారం ఉదయం 4 గంటల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ వారు తెలిపారు.

దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్‌ సోమనాథ్‌ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement