అండర్‌–18 బాలబాలికల బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు రేపు | - | Sakshi
Sakshi News home page

అండర్‌–18 బాలబాలికల బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు రేపు

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా అండర్‌–18 బాల బాలికల బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక ఈనెల 7వ తేదీ మంగళవారం జరుగుతుందని జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎంఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌ కూడలి వద్దనున్న ఎన్‌టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఉన్న బాస్కెట్‌బాల్‌ సెలక్షన్‌ ట్రైన్స్‌ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు 18 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. డీఎస్సీ కోచ్‌ అర్జునరెడ్డి మాట్లాడుతూ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఈ– సేవ సర్టిఫికెట్‌, రెండు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 సంప్రదించాలని ఆయన కోరారు.

రణస్థలంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌

రణస్థలం: రణస్థలంలో జరుగుతున్న పై వంతెన పనులు వాహనదారులకు దినదిన గండంలా మారుతున్నాయి. అలాగే రోడ్డు దాటే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో రామతీర్థాలు కూడలిలో ఉన్న భారీ స్పీడ్‌ బ్రేకర్‌ వల్ల అధిక లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాల వద్ద కట్‌ ప్లేట్‌లు విరిగిపోయాయి.

దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రణస్థలం నుంచి యూబీ పరిశ్రమ వరకు వాహనాలు బారులు తీరాయి. రణస్థలం దాటేందుకు పక్కాగా రెండు గంటలు పట్టిందంటే ట్రాఫిక్‌ తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు జేఆర్‌ పురం పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement