భూవివాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

భూవివాదంలో నలుగురికి గాయాలు

Mar 28 2026 7:12 AM | Updated on Mar 28 2026 7:12 AM

రణస్థలం : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ బట్టుపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహం భూమి విషయమై రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ శివంగం నాగరాజు, అతని కుమారుడు చైతన్య, తల్లి బుల్లెమ్మ, సోదరుడు కుమారుడు సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబాన్ని అంతమొందించడానికే కొందరు నెల్లిమర్ల నుంచి వచ్చారని నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. రిమ్స్‌ నుంచి వచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇరువర్గీయులపై కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్సై కె.అప్పలసూరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement