దోపిడీ దొంగల దారెటు..? | - | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల దారెటు..?

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : కాశీబుగ్గ కేంద్రంగా మంగళవారం పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ దొంగలు చొరబడి భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు చూపించిన గన్‌ ఒరిజినల్‌దేనని షాపు యజమాని చెప్పడం గమనార్హం. షాపు ఓనరైన కిల్లంశెట్టి రామకృష్ణారావు నుంచి దుండగులు మంగళవారం మొబైల్‌ఫోన్‌ ఎత్తుకు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గా ల సమాచారం. టవర్‌ డంప్‌ లొకేషన్‌ ఆధారంగా విజయనగరం బొబ్బిలి దగ్గర ఒకసారి చూపించగా మరోసారి రాయపూర్‌ వద్ద సిగ్నల్స్‌ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి మంగళవారం గారబంద మీదుగా లూప్‌ మార్గాల్లో దుండగులు పర్లాఖిముడి (ఒడిశా) చేరి అక్కడి నుంచి బొబ్బిలి, సాలూరు ఘాట్‌రోడ్డు మీదుగా చత్తీస్‌గఢ్‌ చేరి రాయపూర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన వారు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడటంతో పక్కా గా మహారాష్ట్ర గ్యాంగ్‌ లేదంటే బీహార్‌ గ్యాంగు పనేనని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగుల్లో బంగారం ఎత్తుకుపోయిన కొందరు ఒకవైపు, మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లిన వారు మరో వైపు వెళ్లి పోలీసులకు రాంగ్‌ డైవర్షన్‌ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూ డా 3 చోట్ల చోరీలు జరిగాయి. పాత జాతీయ రహదారికి ఆనుకుని మంకినమ్మ చికెన్‌, మటన్‌ సెంటర్‌, డెకరేషన్‌ సాపు, రైల్వేస్టేషన్‌ దారిలో చోరీలు జరిగాయి. ఇటీవల కాలంలో 3 మెడికల్‌స్టోర్స్‌లో దాదాపు రూ. 4 లక్షల వరకు చోరీకి గురైనా పోలీసులు రికవరీ చేయలేకపోయారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. లక్ష్మీస్వీటుషాపులో సైతం రూ. 1.20 లక్షలు నగదు దొంగిలించారు.

‘పక్కా ప్లాన్‌తోనే వచ్చారు’

పలాస: దొంగలు పక్కా ప్లాన్‌తోనే వచ్చారని, దేవు డి దయ వల్ల తన ప్రాణాలు మిగిలాయని కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్‌ షాపు యజ మాని కిల్లం శెట్టి రామకృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం తన ఇంటి వద్ద భార్య లలిత, అతను అక్కడకు వచ్చిన వారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగలు పక్కా ప్లాన్‌తోనే వచ్చారన్నారు. హిందీలో ఏదేదో చెప్పారని, ఆ తర్వాత రెండు చేతులకు బేడీలు వేశారు. మొత్తం బంగారం దోచుకు పోయారని, తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసుకుపోయారని, అంతా ఒక్క 5 నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఆయనను మాజీ మంత్రి వైఎస్సార్‌ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు బుధవారం పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, తాజా మాజీ కౌన్సిలరు బెల్లాల శ్రీనివాసరావు, పెంట రత్నాకర్‌, బోర బుజ్జి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement