గార: రెడ్‌బుక్ రాజ్యాంగంలో పౌరుల వ్యక్తిగత కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు పెట్టడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకరబాబు తల్లి రెండో వర్ధంతి తన ఇంటి వద్ద జరుపుకుంటుండగా.. అక్కడికి వెళ్లినవారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్‌లు ఇలాంటి కార్యక్రమాలును ప్రోత్సహించడం తగదన్నారు.


