ఆర్టీసీ కండక్టర్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

టెక్కలి రూరల్‌: ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా పాసింజర్లు ఎక్కువ మంది ఉండడంతో లోపలికి వెళ్లమన్నందుకు బస్సు కండక్టర్‌ నాసపు పాపారావుపై ఒక పాసింజర్‌ దాడి చేసిన ఘటన కోటబొమ్మాళి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస డిపోకు చెందిన విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులో కోటబొమ్మాళి జంక్షన్‌ వద్ద గంగు అర్జున్‌ తన కుమార్తెతో కలిసి ఎక్కాడు. అయితే జర్జంగి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో పాసింజర్లు ఎక్కువగా ఉండడంతో కండక్టర్‌ వారిని లోపలికి వెళ్లమని చెప్పాడు. అయితే ఆ సమయంలో తన కుమార్తైపె చేయి వేశాడని అర్జున్‌ కండక్టర్‌తో గొడవ పెట్టుకుని దాడి చేశాడు. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అలాగే డ్రైవర్‌ అడగగా.. అతనిపై సైతం దురుసుగా మాట్లాడడంతో చివరకు బస్సును కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అనంతరం కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement