న్యూస్‌రీల్
శ్రీకాకుళం
అమాతం పెరిగిన కమర్షియల్ గ్యాస్ బండ ధర
● అయినా బ్లాక్‌లోనే దందా..
● గృహావసరాల గ్యాస్ కోసం జనం తిప్పలు
● బుక్ చేసినా 20 రోజుల పైమాటే..
● గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న జనం
లావేరు మండలం ఇజ్జాడపాలెం కిడ్నీ వ్యాధి మరణాలతో వణుకుతోంది. పదిమందికి పైగా మరణాలు సంభవించాయి. –8లో
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
భానుడి భగభగలు ఓ వైపు.. ఆరుబయట కట్టెల పొయ్యి అగ్గిసెగలు మరోవైపు హోటల్ కార్మికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా నగరంలో చాలా హోటళ్లు మూతపడిన సంగతి విదితమే. కొన్ని హోటళ్లు మాత్రమే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాయి. వేసవి కావడం.. మధ్యాహ్నం వేళ వంటలు చేసే పరిస్థితి ఉండడంతో కార్మికులు మండుటెండలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా తమ కష్టం పెరిగిందని.. దినసరి కూలీలో ఏమాత్రం మార్పు లేదని వాపోతున్నారు. ఇలా ఎక్కువ రోజులు అగ్గి వద్ద పని చేయలేమని చెబుతున్నారు. వారి కష్టాలకు నిదర్శనమైన ఈ చిత్రాలు శ్రీకాకుళం నగరంలోని ఓ మెస్ వద్ద కనిపించాయి. – శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)
శ్రీకాకుళం: జిల్లాలో నానాటికీ గ్యాస్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారు లు ఇబ్బంది లేదని చెబుతున్నా వ్యాపారులు, గృహ వినియోగదారులు తీవ్రంగానే ఇక్కట్లకు గురవుతున్నారు. బుకింగ్ చేసిన 20రోజుల వరకు గ్యాస్ రాకపోవడంతో చేసే ది లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలండర్ అమాంతంగా పెరిగినా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. గృహ, వాణిజ్య అవసరాలకు కట్టెల పొయ్యిలే ప్రత్యామ్నాయంగా మారాయి.
జిల్లాలో కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.214లు పెంచారు. గతంలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,970లు ఉండగా.. ప్రస్తుతం రూ.2,184.50లకు చేరుకుంది. పెరిగిన ధరను చమురు సంస్థలు మంగళవారం రాత్రి ప్రకటించి, బుధవారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్‌లో రూ.3500 దాటి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళంలో ఉన్న పలు ప్రైవేట్ కంపెనీల ఏజెన్సీలు పెద్ద ఎత్తున ఈ దందాకు పాల్పడతున్నాయి. గృహ వినియోగదారుల గ్యాస్ నిర్దేశిత వ్యవధిలో సరఫరా కావడం లేదు. బుక్ చేసిన తరువాత 15 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. దీంతో పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు గ్యాస్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. దీంతో గృహ వినియోగ దారులు ప్రత్యామ్నాయ పరిస్థితుల వైపు మొగ్గు చూపుతున్నారు. కట్టెలపొయ్యులు, బొగ్గుల పొయ్యలతో పాటు ఇండక్షన్ పొయ్యలను ఆశ్రయిస్తున్నారు.


