శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలకు వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, వీఓఏ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు డి.జోగారావు కోరారు. వెలుగు వీఓఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హెచ్‌ఎర్ పాలసీ అమలు చేయాలని, సీ్త్ర నిధి ఇన్సెటివ్ బకాయిలు చెల్లించాలని, నాణ్యమైన 5జి మొబైల్ ఫోన్లు ఇవ్వా లని కోరారు. మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుతూ డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు డచ్ భవనం వద్ద వీఓఏ ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని, డీఏ అమలు చేయలేదన్నారు. ఆన్‌లైన్ సరుకులు పంపిస్తామని డబ్బులు కట్టించుకొని సరుకులు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి చెల్లించలేదని అన్నారు. వీఓఏల సమస్యలపై ఏప్రిల్ 13 వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు, 27, 28 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని యూనియన్ కమిటీ నిర్ణయించిందని తెలియజేసారు.


