‘అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయం’ | - | Sakshi
Sakshi News home page

‘అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయం’

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాబు జగజ్జీవన్‌ రామ్‌ 119వ జయంతి వేడుకలను మిల్లు జంక్షన్‌లో ఆదివారం నిర్వహించారు. మిల్లు జంక్షన్‌ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్‌ రామ్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా ఆయన చూపిన చొరవ అద్భుతమని పేర్కొన్నారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

గార: వత్సవలస రాజమ్మ తల్లి యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా పడటంతో గాయాలపాలైన లుకలాపు వెంకటరమణ (45) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గార పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రేగిడి ఆమదాలవలస మండలం లంబకండి గ్రామానికి చెందిన మృతుడు వెంకటరమణతో పాటు గ్రామస్తులు ఆటోలో శనివారం వత్సవలస వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొర్ని గ్రామం మీదుగా వెళ్తుండగా మలుపు వద్ద ఆటో అదుపు తప్పడంతో బోల్తా పడగా, ఆటో కింద ఉండిపోవడంతో గాయాలపాలయ్యాడు. ముందుగా రిమ్స్‌లో చే ర్పించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చోడిపల్లి గంగరాజు తెలిపారు.

గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధిపై దాడికి పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు

ఇచ్ఛాపురం: రెండు రోజుల క్రితం స్థానిక ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఏజెన్సీ ప్రతినిధి వజ్రపు వెంకటేష్‌ పై దాడికి పాల్పడిన ఏఎస్‌పేట చెందిన వ్యక్తి మన్యాల విఘ్నేష్‌ పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపా రు. గ్యాస్‌ ఏజెన్సీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఆర్‌.జనార్ధన్‌ రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ పెట్రోల్‌ బంక్‌

ప్రారంభం

టెక్కలి: టెక్కలి జగతిమెట్ట సమీపంలో ఏర్పా టు చేసిన సబ్‌ కలెక్టర్‌ పెట్రోల్‌ బంక్‌ను మంత్రి కె.అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో పెట్రో ల్‌ బంక్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఐవోసీఎల్‌ విశాఖ డివిజన్‌ మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బి.శేషగిరి, కె.హరివరప్రసాద్‌, రాజీవ్‌కుమార్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

పిడుగు పాటుకు కొబ్బరి చెట్టుకు మంటలు

కవిటి: మండలంలోని రాజపురంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం, మెరుపులకు తోడు పిడుగులు పడ్డాయి. రాజపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఆ చెట్టు మొవ్వుకు కూడా నిప్పు అంటుకుటుంది. వానలోనూ మంటలు చెలరేగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement